jobalertstelugu

RRB NTPC Notification 2024, Expected Exam Date


Railway has released RRB NTPC Notification 2024 for Graduate posts (Level 5 and 6 posts) and Undergraduate posts (Level 2 and 3 posts). The RRB NTPC Exam Date 2024 will be announced soon.

RRB NTPC Notification 2024
RRB NTPC Notification 2024

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ RRB NTPC Notification 2024 ద్వారా, గ్రాడ్యుయేట్ మరియు అండర్-గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 11558 ఖాళీలను రైల్వే  భర్తీ చేయబోతోంది. అండర్-గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులలో  గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మరియు స్టేషన్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలను వివిధ జోనల్ రైల్వేలు మరియు భారతీయ రైల్వేల ఉత్పత్తి యూనిట్లలో భర్తీ చేయనున్నారు. 

RRB NTPC Recruitment 2024

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ రైల్వే ఎన్‌టిపిసి మరియు ఇతర రైల్వే పరీక్షలను నిర్వహిస్తుంది, ప్రతిష్టాత్మకమైన భారతీయ రైల్వేలో చేరాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి అభ్యర్థులకు సువర్ణావకాశాన్ని అందిస్తుంది. RRB NTPC 2024 రిక్రూట్‌మెంట్ ప్రత్యేకించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి 12th పాస్ సర్టిఫికేట్ లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థుల కోసం ఈ RRB NTPC Recruitment 2024 మంచి అవకాశం గా చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో నోటిఫికేషన్ (RRB NTPC Notification 2024), పరీక్ష తేది (RRB NTPC 2024 exam date), దరఖాస్తు స్థితి, అడ్మిట్ కార్డ్ (RRB NTPC admit card 2024), ఆన్సర్ కీ (RRB NTPC Answer Key 2024), పరీక్ష ఫీజు (RRB NTPC 2024 Fee Details), పరీక్ష సరళి (RRB NTPC Exam Pattern 2024), సిలబస్ (RRB NTPC Syllabus 2024), ఖాళీలు (RRB NTPC 2024 Vacancy), అర్హత ప్రమాణాలు (RRB NTPC 2024 Eligibility Criteria) ల యొక్క పూర్తి సమాచారం పొందుపరచడం జరిగింది.

RRB NTPC Notification 2024 released

రైల్వే బోర్డు RRB NTPC 2024 నోటిఫికేషన్ ను 8113 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు మరియు 3445 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. భారతీయ రైల్వేలో గ్రాడ్యుయేట్ మరియు నాన్-గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం మొత్తం 11558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఖాళీలను రైల్వే RRB NTPC 2024 Notification ను ఇటీవల విడుదల చేసింది. ఈ పోస్టులకు కనీస విద్యార్హత 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఈ  విద్యార్హతలను కలిగి ఉండి భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కింద ఇవ్వబడిన RRB NTPC Notification 2024 PDF డౌన్‌లోడ్ లింక్ ను డౌన్ లోడ్ చేసుకొని నోటిఫికేషన్ కు సంబంధించిన అన్ని వివరాలను చూడవచ్చు.

RRB NTPC 2024 Notification Official PDF (Graduate Level): Click to Download

RRB NTPC 2024 Notification Official PDF (Under Graduate Level): Click to Download

రైల్వే బోర్డు RRB NTPC 2024 నోటిఫికేషన్ ను 8113 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు మరియు 3445 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. దిగువన ఉన్న పట్టికలో  RRB NTPC Notification 2024 PDFతో పాటు ముఖ్యమైన వివరాలు ఇవ్వబడ్డాయి. 

బోర్డ్ పేరు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)
 

 

పోస్టులు

గ్రాడ్యుయేట్ పోస్టులు:

చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్

స్టేషన్ మాస్టర్

గూడ్స్ ట్రైన్ మేనేజర్

జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్

సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు:

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్

అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్

ట్రైన్స్ క్లర్క్

కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్

మొత్తం ఖాళీలు  గ్రాడ్యుయేట్ స్థాయి- 8113
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి- 3445
మొత్తం – 11558
పరీక్షా విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
RRB NTPC 2024 పరీక్ష తేదీ will be announced soon
RRB NTPCకి అర్హత 12వ తరగతి / ఏదైనా గ్రాడ్యుయేట్లు
వయో పరిమితి 18 నుండి 33 సంవత్సరాలు / 18 నుండి 36 సంవత్సరాలు
RRB NTPC ఎంపిక విధానం  CBT-1

CBT-2

స్కిల్ టెస్ట్

డాక్యుమెంట్ వెరిఫికేషన్

మెడికల్ టెస్ట్

అధికారిక వెబ్‌సైట్ http://www.rrbcdg.gov.in/

RRB NTPC 2024 Exam Date

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు RRB NTPC Notification 2024 ను 8113 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు మరియు 3445 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు కోసం నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. అండర్-గ్రాడ్యుయేట్ స్థాయి పోస్ట్‌లు మరియు గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు CBT 1 పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. దీని కోసం RRB NTPC పరీక్ష తేదీని (RRB NTPC 2024 Exam Date) త్వరలో ప్రకటిస్తుంది. పరీక్ష తేదీలు ప్రకటించిన తర్వాత, అధికారిక షెడ్యూల్ కూడా ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు.

RRB NTPC 2024 Exam Date: Click Here

RRB NTPC 2024 Important Dates

RRB NTPC నోటిఫికేషన్ 2024 కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

S No అంశం తేదీలు (Graduate Posts)  తేదీలు (Undergraduate Posts)
1 RRB NTPC 2024 నోటిఫికేషన్ 13 సెప్టెంబర్ 2024 20 సెప్టెంబర్ 2024
2 RRB NTPC 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తు   ప్రారంభ తేదీ 14 సెప్టెంబర్ 2024 21 సెప్టెంబర్ 2024
3 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 అక్టోబర్ 2024 (11:59 pm) 27 అక్టోబర్ 2024 (11:29 pm)
4 చివరి తేదీ తర్వాత ఫీజు చెల్లింపు తేదీ 21 & 22 అక్టోబర్ 2024 28 & 29 అక్టోబర్ 2024
5 దరఖాస్తు ఫారమ్‌లో సవరణ తేదీలు    23 –  30 అక్టోబర్ 2024 30 అక్టోబర్ – 6 నవంబర్ 2024 
6 RRB NTPC అప్లికేషన్ స్థితి 2024 will be announced soon will be announced soon
7 RRB NTPC 2024 Admit Card will be announced soon will be announced soon
8 RRB NTPC 2024 Exam Date  will be announced soon will be announced soon

RRB NTPC 2024 Vacancy

భారతీయ రైల్వే గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం RRB NTPC 2024 కు సంబంధించిన ఖాళీలను ప్రకటించింది. RRB NTPC Notification 2024 ప్రకారం, ఈ సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు 3445 ఖాళీలు మరియు గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు 8113 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్ట్ వారీగా మరియు విద్యా అర్హతల వారీగా ఖాళీలు క్రింద పేర్కొన్న పట్టికలో ఇవ్వబడ్డాయి.

RRB NTPC Graduate Level Vacancy 2024

RRB NTPC Notification 2024 ప్రకారం గ్రాడ్యుయేట్ పోస్టులకు యూనివర్సిటీ డిగ్రీ లేదా దానికి సమానమైన కనీస విద్యార్హత మరియు 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అర్హులు..

S No పోస్టుల పేరు మొత్తం ఖాళీలు (అన్ని జోన్లు కలిపి)
1 గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144
2 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ 1736
3 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732
4 జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1507
5 స్టేషన్ మాస్టర్ 994
మొత్తం ఖాళీలు 8113
RRB NTPC Vacancy for Graduate Posts [Zone-wise]

RRB NTPC Notification 2024 ప్రకారం గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు మొత్తం ఖాళీలు 8113  విడుదల చేయబడ్డాయి. ఇందులో అత్యదికంగా కోల్‌కతా జోన్ కింద గరిష్ట సంఖ్యలో ఖాళీలు (1382) ఉన్నాయి. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా జోన్ వారీగా RRB NTPC 2024 గ్రాడ్యుయేట్ స్థాయి ఖాళీలను క్రింది పట్టికలో చూడవచ్చు.

జోన్  UR SC ST OBC EWS మొత్తం
RRB అహ్మదాబాద్ 202 79 37 137 61 516
RRB అజ్మీర్ 56 20 07 35 14 132
RRB బెంగళూరు 206 71 36 134 49 496
RRB భోపాల్ 65 32 12 25 21 155
RRB భువనేశ్వర్ 328 108 55 199 68 758
RRB బిలాస్పూర్ 273 88 51 168 69 649
RRB చండీగఢ్ 228 59 29 65 29 410
RRB చెన్నై 195 65 34 105 37 436
RRB గోరఖ్‌పూర్ 54 19 10 33 13 129
RRB గౌహతి 213 74 38 140 51 516
RRB జమ్మూ-శ్రీనగర్ 60 20 13 38 14 145
RRB కోల్‌కతా 628 188 121 329 116 1382
RRB మాల్దా 83 28 16 50 21 198
RRB ముంబై 319 126 66 217 99 827
RRB ముజఫర్‌పూర్ 04 02 01 04 01 12
RRB ప్రయాగరాజ్ 103 34 13 56 21 227
RRB పాట్నా 48 16 09 28 10 111
RRB రాంచీ 133 49 22 87 31 322
RRB సికింద్రాబాద్ 212 66 39 101 60 478
RRB సిలిగురి 17 06 03 10 04 40
RRB తిరువనంతపురం 67 30 23 33 21 174
మొత్తం ఖాళీలు 3494 1180 635 1994 810 8113

RRB NTPC Under-Graduate Level Vacancy 2024

RRB NTPC Notification 2024 ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు కనీస విద్యార్హత 12వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్ష మరియు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు మాత్రమే అర్హలు.

S. No. పోస్టు మొత్తం ఖాళీలు (అన్ని జోన్ లు కలిపి)
1 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990
2 అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361
3 ట్రైన్స్ క్లర్క్ 72
4 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2022
                                      మొత్తం ఖాళీలు 3445

RRB NTPC Notification 2024 ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు మొత్తం ఖాళీలు 3445  విడుదల చేయబడ్డాయి. ఇందులో అత్యదికంగా RRB ముంబై జోన్ కింద గరిష్ట సంఖ్యలో ఖాళీలు (699) ఉన్నాయి. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా జోన్ వారీగా RRB NTPC 2024 గ్రాడ్యుయేట్ స్థాయి ఖాళీలను క్రింది పట్టికలో చూడవచ్చు.

జోన్ UR SC ST OBC EWS మొత్తం
RRB అహ్మదాబాద్ 91 32 16 48 23 210
RRB అజ్మీర్ 38 07 05 14 07 71
RRB బెంగళూరు 25 10 04 16 05 60
RRB భోపాల్ 30 06 05 12 05 58
RRB భువనేశ్వర్ 22 09 07 13 05 56
RRB బిలాస్పూర్ 59 22 13 44 14 152
RRB చండీగఢ్ 97 36 23 65 26 247
RRB చెన్నై 99 27 21 31 16 194
RRB గోరఖ్‌పూర్ 54 18 11 25 12 120
RRB గౌహతి 69 26 13 47 20 175
RRB జమ్మూ-శ్రీనగర్ 65 23 11 37 11 147
RRB కోల్‌కతా 200 68 55 95 34 452
RRB మాల్దా 07 02 03 12
RRB ముంబై 290 103 55 182 69 699
RRB ముజఫర్‌పూర్ 28 10 05 18 07 68
RRB ప్రయాగరాజ్ 254 51 31 35 18 389
RRB పాట్నా 05 03 03 03 02 16
RRB రాంచీ 29 12 07 20 08 76
RRB సికింద్రాబాద్ 42 16 07 17 07 89
RRB సిలిగురి 17 06 03 12 04 42
RRB తిరువనంతపురం 42 17 16 25 12 112
మొత్తం ఖాళీలు 1563 504 311 762 305 3445

RRB NTPC 2024 Online Application Form

RRB NTPC Notification 2024 లో భాగంగా గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 14 సెప్టెంబర్ 2024న ప్రారంభించబడింది మరియు గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 20 అక్టోబర్ 2024. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం, ఆన్‌లైన్ దరఖాస్తు 21 సెప్టెంబర్ 2024న ప్రారంభమై 27 అక్టోబర్ 2024 వరకు కొనసాగింది.

RRB NTPC 2024 Fee Details

జనరల్/ఓబీసీ కేటగిరీల కోసం RRB NTPC ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు 500/ మరియు SC/ ST/ Ex-SM/ PwBD/ Female/ Transgender/ EBC లకు ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు 250/-. ఈ ఫీజు CBT 1 పరీక్షకు హాజరైతే జనరల్/ఓబీసీ కేటగిరీల లకు బ్యాంకు ఛార్జీలను మినహాయించి రూ. 400 మరియు SC/ ST/ Ex-SM/ PwBD/ Female/ Transgender/ EBC లకు 250/- రీఫండ్ చేయబడుతుంది.

S No Category Application Fee Refundable Amount
1 SC/ ST/ Ex-SM/ PwBD/ Female/ Transgender/ EBC 250/- 250/-
2  All other category 500/- 400/-
RRB NTPC 2024 Eligibility Criteria

RRB NTPC రిక్రూట్‌మెంట్ 2024కి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా బోర్డు నిర్దేశించిన కనీస అర్హత అవసరాలకు అనుగుణంగా అర్హత కలిగి ఉండాలి. RRB NTPC 2024 Exam కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు విద్యార్హత మరియు వయోపరిమితి క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.

RRB NTPC Educational Qualification

RRB NTPC 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా కనీస విద్యార్హతను కలిగి ఉండాలి.

Level పోస్ట్‌లు విద్యా అర్హత
గ్రాడ్యుయేట్ స్థాయి
  • చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్
  • స్టేషన్ మాస్టర్
  • గూడ్స్ ట్రైన్ మేనేజర్
  • జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ 
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్
  • ట్రైన్స్ క్లర్క్
  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్
గుర్తింపు పొందిన పాఠశాల నుండి 12వ తరగతి ఉత్తీర్ణత 

RRB NTPC Age Limit (as on 01/01/2025)

RRB NTPC 2024 పరీక్షకు అర్హత పొందేందుకు అభ్యర్థుల కనీస వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 36 సంవత్సరాల లోపు ఉండాలి.

Level వయో పరిమితి
గ్రాడ్యుయేట్ 18 నుండి 36 సంవత్సరాలు
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి (12వ తరగతి ఉత్తీర్ణత) 18 నుండి 33 సంవత్సరాలు

RRB NTPC 2024 Selection Process

RRB NTPC 2024 Recruitment ప్రక్రియ ఈ క్రింది దశలలో జరుగుతుంది:

  • CBT 1
  • CBT 2
  • టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) / ఆప్టిట్యూడ్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష
RRB NTPC 2024 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఎంపిక విధానం
SNo పోస్ట్‌లు ఎంపిక విధానం
1 గూడ్స్ ట్రైన్ మేనేజర్ CBT 1, CBT 2
2 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ CBT 1, CBT 2, టైపింగ్ స్కిల్ టెస్ట్
3 జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ CBT 1, CBT 2, టైపింగ్ స్కిల్ టెస్ట్
4 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ CBT 1, CBT 2
5 స్టేషన్ మాస్టర్ CBT 1, CBT 2, CBAT
RRB NTPC 2024 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఎంపిక విధానం 
SNo పోస్ట్‌లు ఎంపిక విధానం
1 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ CBT 1, CBT 2, టైపింగ్ స్కిల్ టెస్ట్
2 అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ CBT 1, CBT 2, టైపింగ్ స్కిల్ టెస్ట్
3 ట్రైన్ క్లర్క్ CBT 1, CBT 2
4 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ CBT 1, CBT 2

RRB NTPC 2024 Exam Pattern

రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1), కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 2), టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. పైన పేర్కొన్న రిక్రూట్‌మెంట్ దశల ఆధారంగా, అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.

ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆంగ్లం, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ భాషలలో అందుబాటులో ఉంటుంది.

RRB NTPC 2024 Exam Pattern: CBT 1
SNo విభాగాలు ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం
1 General Awareness 40 40  

 

90 నిమిషాలు

2 Mathematics 30 30
3 General Intelligence and Reasoning 30 30
4 మొత్తం 100 100

 

RRB NTPC 2024 Exam Pattern: CBT 2
SNo విభాగాలు ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం
1 General Awareness 50 50  

 

120 నిమిషాలు

2 Mathematics 35 35
3 General Intelligence and Reasoning 35 35
4 మొత్తం 120 120

గమనిక: ప్రతి తప్పు సమాధానానికి ⅓వ మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

RRB NTPC 2024 Marks Normalisation Formulae:

RRB Normalization

RRB NTPC 2024 Salary

RRB NTPC పోస్ట్‌లు గ్రాడ్యుయేట్ పోస్ట్‌లు మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్‌లు అనే రెండు వర్గాలుగా వర్గీకరించరించారు. ఒక్కో కేటగిరీ కింద ఉన్న పోస్టులు మరియు వాటి వేతనం వివరాలు (7th CPC ప్రకారం)

RRB NTPC Salary for Undergraduate Posts:

  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 19,900/- (లెవల్-2)
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 19,900/- (లెవల్-2)
  • ట్రైన్ క్లర్క్ – 19,900/- (లెవల్-2)
  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ – 21,700/- (లెవల్-3)

RRB NTPC Salary for Graduate Posts:

  • గూడ్స్ ట్రైన్ మేనేజర్: రూ. 29,200/- (లెవల్-5)
  • చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ – 35,400/- (లెవల్-6)
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 29,200/- (లెవల్-5)
  • జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ -. 29,200/- (లెవల్-5)
  • స్టేషన్ మాస్టర్ – 35,400/- (లెవల్-6)

RRB NTPC 2024 Exam Analysis

RRB NTPC CBT 1: General Awareness Section

S No అంశం ప్రశ్నల సంఖ్య స్థాయి
1 చరిత్ర 6-7 Easy
2 భౌగోళిక శాస్త్రం 5 Moderate
3 రసాయన శాస్త్రం 1-2 Easy-Moderate
4 జీవశాస్త్రం 3-4 Easy
5 భౌతిక శాస్త్రం 2-3 Easy-Moderate
6 కంప్యూటర్ 4 Moderate
7 పాలిటి 1-2 Easy
8 స్టాటిక్ GK 8-9 Moderate
9 కరెంట్ అఫైర్స్ 11-12 Easy-Moderate
మొత్తం 40 Easy-Moderate

RRB NTPC CBT 1: Mathematics Section

S No అంశం ప్రశ్నల సంఖ్య స్థాయి
1 శాతాలు  1 Easy
2 సంఖ్య వ్యవస్థ 3 Easy
3 LCM & HCF 2-3 Easy-Moderate
4 సమయం & పని 2-3 Easy
5 CI & SI 2-3 Easy
6 సమయం & దూరం 3 Easy
7 లాభం & నష్టం 2 Easy
8 Mensuration 1 Easy-Moderate
9 త్రికోణమితి 2-3 Easy-Moderate
10 సగటు 1-2 Easy-Moderate
11 స్క్వేర్-రూట్ 2 Moderate
12 నిష్పత్తులు  1-2 Easy
13 మొత్తం 30 Easy-Moderate

RRB NTPC CBT 1: General Intelligence & Reasoning Section

S No అంశాలు ప్రశ్నల సంఖ్య స్థాయి
1 పజిల్స్ 3 Easy
2 Syllogism 3 Easy
3 వెన్ రేఖాచిత్రం 3 Easy
4 Sentence arrangement 3 Moderate
5 Statement & Assumptions 1 Easy-Moderate
6 Statement & Conclusion 2 Moderate
7 Series 1 Easy
8 అనలాజి 1 Easy
9 Mathematical Operations 3 Moderate
10 డైరెక్షన్  2 Easy-Moderate
11 రక్త సంబంధాలు  1 Easy-Moderate
12 Odd one out 2 Moderate
13 సీటింగ్ అమరిక 1 Easy-Moderate
14 కోడింగ్-డీకోడింగ్ 1 Easy-Moderate
15 మొత్తం 30 Easy-Moderate

RRB NTPC 2024 Admit Card Download

RRB అధికారిక వెబ్‌సైట్‌లో లింక్ యాక్టివేట్ అయిన తర్వాత RRB NTPC అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాంతీయ రిక్రూట్‌మెంట్ బోర్డులలో జోన్ వారీగా అడ్మిట్ కార్డ్/హాల్ టికెట్ అందుబాటులో ఉంటుంది. అడ్మిట్ కార్డ్ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Important Documents Required at the RRB NTPC Exam

RRB NTPC పరీక్ష సమయంలో తీసుకెళ్లవలసిన ముఖ్యమైన పత్రాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • ID ప్రూఫ్ 
  • పాస్ సైజు ఫోటోగ్రాఫ్
  • RRB NTPC అడ్మిట్ కార్డ్ కాపీ

RRB NTPC అడ్మిట్ కార్డ్ లేకుండా అభ్యర్థులు పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి అనుమతించబడరు.

RRB NTPC 2024 Cut-Off

RRB NTPC 2015 CBT 2 పరీక్ష కోసం CBT 1 లో జోన్ ల వారీగా కట్-ఆఫ్‌ మార్క్స్ ను క్రింద ఇవ్వబడిన టేబుల్ లో చూడవచ్చు.

S No జోన్ UR OBC SC ST
1 అహ్మదాబాద్ 72.86 64.91 57.23 48.1
2 అజ్మీర్ 77.39 70.93 62.13 59.74
3 అలహాబాద్ 77.49 70.47 62.85 47.02
4 బెంగళూరు 64.97 57.28 30.1 29
5 భోపాల్ 72.9 66.31 58.61 51.16
6 భువనేశ్వర్ 71.91 65.76 53.09 48.79
7 బిలాస్పూర్ 68.79 60.7 51.49 50.07
8 చండీగఢ్ 82.27 71.47 71.87 46.71
9 చెన్నై 72.14 69.11 57.67 46.84
10 గోరఖ్‌పూర్ 77.43 69.01 56.63 47.67
11 గౌహతి 66.44 57.11 52.53 52.91
12 జమ్మూ 68.72 50.88 52.27 38.05
13 కోల్‌కతా 79.5 71.53 67.07 52.92
14 మాల్డా 61.87 48.42 43.11 31.89
15 ముంబై 77.05 70.21 63.6 54.95
16 ముజఫర్‌పూర్ 57.97 45.57 30.06 25
17 పాట్నా 63.03 53.57 38.55 26.69
18 రాంచీ 63.75 57.29 45.48 48.58
19 సికింద్రాబాద్ 77.72 72.87 63.73 59.13
20 సిలిగురి 67.52 56.26 54.31 45.9
21 తిరువనంతపురం 79.75 75.1 56.14 36.45

 

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *