jobalertstelugu

TSPSC Group 2 Exam Date 2024 Announced, Check Exam Schedule


TSPSC Group 2 Exam Date 2024 Announced, The TSPSC Group-II Services Recruitment Examinations have been rescheduled to 15th and 16th December 2024.

TSPSC Group 2 Exam Date 2024
TSPSC Group 2 Exam Date 2024

TSPSC Group 2 Exam Date 2024 Announced

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 సర్వీసుల కింద వివిధ కేటగిరీల్లోని 783 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC Group 2 Notification ను విడుదల చేసింది. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ACTO (అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్), సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, మున్సిపల్ కమీషనర్ Gr-III, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ వంటి మొదలైన వివిధ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 2 పరీక్షను నిర్వహిస్తుంది. TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 కొత్త పరీక్ష తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన 22 ఆగస్టు 2024న అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.inలో విడుదల చేయబడింది. ఇంతకుముందు ఆగస్టు 2024లో షెడ్యూల్ చేయబడిన TSPSC గ్రూప్ 2 పరీక్ష 15 మరియు 16 డిసెంబర్ 2024కి రీషెడ్యూల్ చేసారు. TSPSC గ్రూప్ 2 పరీక్ష గురించి పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.

TSPSC Group 2 Exam 2024 Full Details 

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ TSPSC Group 2 పోస్టుల కోసం వ్రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది. TSPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2024 గురించిన ముఖ్యమైన అంశాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి.

TSPSC Group 2 Recruitment 2024
సంస్థ పేరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్ట్ గ్రూప్ 2
మొత్తం ఖాళీలు 783
అప్లికేషన్ విధానం ఆన్‌లైన్
పరీక్ష తేదీ 15 & 16 డిసెంబర్ 2024
ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష
అధికారిక సైట్ https://www.tspsc.gov.in

TSPSC Group 2 Exam Date 2024 Announced

TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 రీషెడ్యూల్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక నోటీసును విడుదల చేసింది. TSPSC గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు డిసెంబర్ 15 మరియు 16వ తేదీలకు రీషెడ్యూల్ చచేసారు. పూర్తి షెడ్యూల్‌ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ లో విడుదల చేసారు.

S No TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీ 2024 పేపర్  సబ్జెక్టులు సమయం 
 

1

 

15 డిసెంబర్ 2024

పేపర్ 1 జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ 10 AM – 12.30 PPM
పేపర్ 2  చరిత్ర, పాలిటి  మరియు సొసైటీ  3 PM – 5.30 PM
 

2

 

16 డిసెంబర్ 2024

పేపర్ 3 ఎకానమీ  మరియు అభివృద్ధి 10 AM – 12.30 PM
పేపర్ 4 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు 3 PM – 5.30 PM

TSPSC Group 2 Exam Date 2024 Webnote: Click Here

TSPSC Group 2 Notification 2022 Important Dates

TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీ 2024 (TSPSC Group 2 Exam Date 2024) TSPSC ద్వారా సవరించబడింది. TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీ 2024 15 మరియు 16 డిసెంబర్ 2024న నిర్వహించబడుతుంది మరియు వ్రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ పరీక్ష తేదీకి 07 నుండి 10 రోజుల ముందు విడుదల చేయబడుతుంది. TSPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2024 కోసం పూర్తి షెడ్యూల్‌ను ఇక్కడ చూడండి.

S No TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీ 2024
1 TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 29 డిసెంబర్ 2022
2 TSPSC గ్రూప్ 2 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 18 జనవరి 2023
3 TSPSC గ్రూప్ 2 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చివరి తేదీ 16 ఫిబ్రవరి 2023
4 TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 09 డిసెంబర్ 2024
5 TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీ 2024 15 & 16 డిసెంబర్ 2024

TSPSC Group 2 Admit Card 2024 Download

TSPSC గ్రూప్ 2 ఖాళీల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 జారీ చేయబడుతుంది. TSPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకునే లింక్ పరీక్ష తేదీకి 7 రోజుల ముందు అనగా 09 డిసెంబర్ న వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. TSPSC ID మరియు పుట్టిన తేదీని ఉపయోగించి దరఖాస్తుదారులు తమ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSPSC Group 2 Notification

తెలంగాణ గ్రూప్-2 సర్వీసుల కింద వివిధ కేటగిరీల్లోని 783 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్‌ (TSPSC Group 2 Notification), పరీక్ష తేదీ (TSPSC Group 2 Exam Date 2024), అర్హత (TSPSC Group 2 Eligibility Criteria), పరీక్షా సరళి (TSPSC Group 2 Exam Pattern), సిలబస్ (TSPSC Group 2 Exam Syllabus), ఎంపిక ప్రక్రియ (TSPSC Group 2 Selection Process) మొదలైన పరీక్షకు సంబంధించిన మొత్తం సమాచారం ఈ ఆర్టికల్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేయడానికి క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.

TSPSC Group 2 Notification Download: Click Here

TSPSC Group 2 Vacancy 2024

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2022-23 ద్వారా వివిధ గ్రూప్ 2 పోస్టుల కోసం 783 ఖాళీలను ప్రకటించింది. దీనిని 29 డిసెంబర్ 2022న TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ (TSPSC Group 2 Notification)ను  అధికారులు విడుదల చేశారు. TSPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2024 ఖాళీల వివరాలు దిగువ పట్టికలో పేర్కొనబడ్డాయి.

TSPSC గ్రూప్ 2 ఖాళీలు 
SI  No పోస్ట్‌లు ఖాళీలు
1 మున్సిపల్ కమీషనర్ Gr.III 11
2 అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 59
3 నాయబ్ తహశీల్దార్ 98
4 సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II 14
5 అసిస్టెంట్ రిజిస్ట్రార్ 63
6 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 09
7 పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో మండల పంచాయతీ అధికారి [విస్తరణ అధికారి] 126
8 ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ 97
9 సహాయ అభివృద్ధి అధికారి (చేనేత మరియు జౌళి శాఖ) 38
10 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం) 165
11 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (శాసనసభ సెక్రటేరియట్‌) 15
12 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఆర్థిక శాఖ) 25
13 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (న్యాయ శాఖ) 07
14 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం) 02
15 జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ Gr-II 11
16 అసిస్టెంట్ బీసీ అభివృద్ధి అధికారి 17
17 అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 09
18 అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి 17
మొత్తం  783

TSPSC Group 2 Application Fee

TSPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ నింపే ప్రక్రియలో దరఖాస్తు రుసుమును చెల్లించాలి. TSPSC గ్రూప్ 2 దరఖాస్తు రుసుము ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. 

Category దరఖాస్తు ప్రక్రియ రుసుము పరీక్ష రుసుము
PH, SC, ST, OBC, మరియు EX-సర్వీస్‌మెన్/మహిళలు 150/- Nil
Others 150/- 100/-

TSPSC Group 2 Posts Eligibility Criteria

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2022-23 ద్వారా వివిధ గ్రూప్ 2 పోస్టుల కోసం 783 ఖాళీలను ప్రకటించింది. TSPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వారి విద్యార్హత, జాతీయత మరియు వయోపరిమితి ఆధారంగా కింది ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ క్రింది అర్హతలు ఉన్నవారు పైన పేర్కొన్న పోస్టులకు అర్హులు.

  • అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి.
  • అతను/ఆమె రాష్ట్రంలోని ప్రాంతీయ భాషలో నిష్ణాతులై ఉండాలి.
  • అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుండి ఏదైనా విభాగంలో 50% మరియు అంతకంటే ఎక్కువ మార్కులతో  గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

TSPSC Group 2 Age Relaxation

S No Category Age Relaxation
1 OBC 03 సంవత్సరాలు
2 SC/ST 05 సంవత్సరాలు
3 రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి 05 సంవత్సరాలు
4 PHC 10 సంవత్సరాలు
5 EX-సర్వీస్‌మెన్/NCC 03 సంవత్సరాలు

TSPSC Group 2 Exam Selection Process

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2022-23 ద్వారా వివిధ గ్రూప్ 2 పోస్టుల కోసం 783 ఖాళీలను ప్రకటించింది. TSPSC గ్రూప్ 2 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు TSPSC నిర్వహించే  వ్రాత పరీక్షలలో (పేపర్ I, II, III మరియు IV) మెరిట్ ప్రకారం TSPSC గ్రూప్ 2లో ఎంపిక చేయబడతారు. 

TSPSC Group 2 Exam Pattern

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 2 త్రిభాషా భాషలో (ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ) ఆబ్జెక్టివ్ టైపులో ప్రశ్న పత్రం ఉంటుంది, TSPSC గ్రూప్ 2 పరీక్షలో మొత్తం 4 పేపర్ లు ఉంటాయి. TSPSC గ్రూప్ 2 పరీక్షలో ఒక్కో పేపర్ కి 150 మార్కులు మొత్తం 600 మార్కులు ఉంటాయి.

SNo పేపర్  ప్రశ్నలు సమయం (Minutes) గరిష్ట మార్కులు
1 పేపర్ 1 150 150 150
2 పేపర్ 2 150 150 150
3 పేపర్ 3 150 150 150
4 పేపర్ 4 150 150 150
TSPSC Group 2 Syllabus 2024

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2022-23 ద్వారా వివిధ గ్రూప్ 2 పోస్టుల కోసం 783 ఖాళీలను ప్రకటించింది. దీని కోసం సిలబస్ క్రింది పట్టికలో ఇవ్వబడింది. 

S No పేపర్ సబ్జెక్ట్ అంశాలు మార్కులు
1 పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్: ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ

జనరల్ సైన్స్: సైన్స్ అండ్ టెక్నాలజీ

ప్రపంచ భూగోళ శాస్త్రం: భారతీయ భౌగోళిక శాస్త్రం మరియు తెలంగాణ రాష్ట్రం.

అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు

పర్యావరణ సమస్యలు – విపత్తు నిర్వహణ 

భారతదేశం – చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం

తెలంగాణ రాష్ట్రం: వారసత్వం, సమాజం, సంస్కృతి, కళలు మరియు సాహిత్యం మరియు విధానాలు

సామాజిక చేరిక, హక్కుల సమస్యలు మరియు సమ్మిళిత విధానాలు

లాజికల్ రీజనింగ్: అనలిటికల్ మరియు డేటా ఇంటర్‌ప్రెటేషన్

ఇంగ్లీష్

150
2 పేపర్ 2 చరిత్ర, రాజకీయాలు & సమాజం సామాజిక-సాంస్కృతిక చరిత్ర (భారతదేశం & తెలంగాణ రాష్ట్రం)

భారత రాజ్యాంగం మరియు విధానాల యొక్క అవలోకనం

సామాజిక నిర్మాణం, సమస్యలు మరియు ప్రజా విధానాలు

150
3 పేపర్ 3 ఆర్థిక వ్యవస్థ & అభివృద్ధి భారతీయ ఆర్థిక వ్యవస్థ: సమస్యలు మరియు సవాళ్లు

తెలంగాణ రాష్ట్రం: ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి

అభివృద్ధి మరియు మార్పు సమస్యలు

150
4 పేపర్ 4 తెలంగాణ ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర భావన (1948-1970)

సమీకరణ దశ (1971-1990)

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశ (1991-2014)

150
మొత్తం  600

TSPSC Group 2 Salary 2024

TSPSC గ్రూప్ 2 జీతం 2024
S No పోస్ట్‌లు జీతం
1 మున్సిపల్ కమీషనర్ Gr.III రూ. 43,490- 118230
2 అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రూ. 42300- 115270
3 నాయబ్ తహశీల్దార్ రూ. 42300- 115270
4 సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II రూ. 42300- 115270
5 అసిస్టెంట్ రిజిస్ట్రార్ రూ. 42300- 115270
6 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రూ. 43490- 118230
7 పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో మండల పంచాయతీ అధికారి [విస్తరణ అధికారి] రూ. 38890- 112510
8 ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రూ. 38890- 112510
9 సహాయ అభివృద్ధి అధికారి (చేనేత మరియు జౌళి శాఖ) రూ. 38890- 112510
10 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం) రూ. 38890- 112510
11 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (శాసనసభ సెక్రటేరియట్‌) రూ. 38890- 112510
12 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఆర్థిక శాఖ) రూ. 38890- 112510
13 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (న్యాయ శాఖ) రూ. 38890- 112510
14 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం) రూ. 38890- 112510
15 జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ Gr-II రూ. 42,300- 115270
16 అసిస్టెంట్ బీసీ అభివృద్ధి అధికారి రూ. 45960- 124150
17 అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రూ. 45960- 124150
18 అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రూ. 45960- 124150

TSPSC Group 2 Admit Card 2024

TSPSC వ్రాత పరీక్షకు 7 రోజుల ముందు TSPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్ 2024 (TSPSC Group 2 Admit Card 2024) ని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. TSPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్ pdf అభ్యర్థుల పేరు, రోల్ నంబర్, పరీక్ష చిరునామా మరియు పరీక్ష సమయాలు వంటి వివరాలను కలిగి ఉంటుంది. 

TSPSC Group 2 Admit Card 2024 డౌన్లోడ్: Click Here

TSPSC Group 2 Hall Ticket Release Date 2024

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 (TSPSC Group 2 Hall Ticket Release Date 2024)  09 డిసెంబర్ 2024న అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inలో విడుదల చేయబడుతుంది.

TSPSC Group 2 Result & Cut off 2024

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2022-23 ద్వారా వివిధ గ్రూప్ 2 పోస్టుల కోసం 783 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టుల కోసం త్వరలో వ్రాత పరీక్ష ను నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆన్సర్ కి ని విడుదల చేస్తారు. ఆ తర్వాత వ్రాత పరీక్షా లో వచ్చిన మార్కుల ఆధారంగా మొదట General Ranking List (GRL).చివరగా TSPSC గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు విడుదల చేయబడతాయి. అలాగే TSPSC గ్రూప్ 2 ఫలితాలను కట్-ఆఫ్ మార్కులను TSPSC విడుదల చేస్తుంది.

TSPSC Group 2 Previous year Cut off Marks 2016: Click Here

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *