jobalertstelugu

TSPSC Group 2 Hall Ticket 2024 Download, Link Active on Official Website


The TSPSC Group 2 Hall Ticket 2024 was recently released on the official website, www.tspsc.gov.in. Hall Ticket is enabled on the website to download.

TSPSC Group 2 Hall Ticket Download 2024
TSPSC Group 2 Hall Ticket Download 2024

TSPSC Group 2 Hall Ticket 2024 Download

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 సర్వీసుల కింద వివిధ కేటగిరీల్లోని 783 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC Group 2 Notification ను విడుదల చేసింది. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ACTO (అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్), సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, మున్సిపల్ కమీషనర్ Gr-III, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ వంటి మొదలైన వివిధ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 2 పరీక్షను నిర్వహిస్తుంది. TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 కొత్త పరీక్ష తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన 22 ఆగస్టు 2024న అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.inలో విడుదల చేయబడింది. ఇంతకుముందు ఆగస్టు 2024లో షెడ్యూల్ చేయబడిన TSPSC గ్రూప్ 2 పరీక్ష 15 మరియు 16 డిసెంబర్ 2024కి రీషెడ్యూల్ చేసారు. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC Group 2 Hall Ticket 2024 ని ఇటీవల అధికారిక వెబ్‌సైట్ @tspsc.gov.inలో విడుదల చేసింది. TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 డిసెంబర్ 15 మరియు 16, 2024 తేదీల్లో నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రం లోనికి అడ్మిట్ కార్డ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ తీసుకురావాలి.

TSPSC Group 2 Hall Ticket 2024 Download

TSPSC Group 2 Hall Ticket 2024 ని TSPSC అధికారులు పరీక్ష తేదీకి ఒక వారం ముందు అనగా 9 డిసెంబర్ 2024న అధికారిక వెబ్‌సైట్ @tspsc.gov.inలో గ్రూప్ 2 హాల్ టిక్కెట్లను విడుదల చేసారు. TSPSC గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు OTR మరియు పుట్టిన తేదీని ఉపయోగించి హాల్ టికెట్ 2024 ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 2 పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించబడుతుంది, అంటే ఉదయం 10 నుండి 12:30 వరకు మరియు మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది.

TSPSC Group 2 Hall Ticket 2024 Download Link: Click Here

TSPSC గ్రూప్ 2 పరీక్ష తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కేంద్రాలలో జరుగుతుంది. మీరు అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in నుండి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024  డౌన్‌లోడ్ లింక్‌ను ఇక్కడ అప్‌డేట్ చేసాము మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదు. హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, మీకు మీ OTR వివరాలు మరియు పుట్టిన తేదీ అవసరం. TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోండి మరియు పరీక్ష కోసం ప్రింటవుట్ తీసుకోండి.

TSPSC Group 2 Hall Ticket Download 2024:

తెలంగాణలో దాదాపు 783 గ్రూప్‌-2 పోస్టులకు 5.5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు  తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ  మేరకు టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 హాల్‌టికెట్లు  అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడే విడుదల అయ్యాయి.  

TSPSC Group 2 Exam Pattern 2024:

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షలో మొత్తం నాలుగు పేపర్ లు ఉన్నాయి. దానికోసం డిసెంబర్ 15న రెండు సెషన్లలో అనగా  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1 మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 16న పేపర్‌-3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-4 నిర్వహిస్తారు. అభ్యర్థులు ఉదయం 08:30 గంటల నుంచి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబడతారు.ఉదయం 09:30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్ మూసివేయబడును. మధ్యాహ్నం సెషన్ కోసం మరియు  మధ్యాహ్నం 1:30 PM నుండి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబడతారు. 2:30 PM తరవాత అభ్యర్థులెవరూ ప్రవేశించడానికి అనుమతించబడరు. గేట్లు మూసివేసిన తర్వాత అభ్యర్థులు ఎవరు పరీక్షా కేంద్రం లోనికి అనుమతించబడరు. కావున అభ్యర్థులు పరీక్షా కేంద్రం కు త్వరగా వచ్చి గేట్ లు తెరిచిన తరవాత లోనికి వెళ్ళగలరు. 

TSPSC Group 2 Exam Date 2024

S No TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీ 2024 పేపర్  సబ్జెక్టులు సమయం 
 

1

 

15 డిసెంబర్ 2024

పేపర్ 1 జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ 10 AM – 12.30 PPM
పేపర్ 2  చరిత్ర, పాలిటి  మరియు సొసైటీ  3 PM – 5.30 PM
 

2

 

16 డిసెంబర్ 2024

పేపర్ 3 ఎకానమీ  మరియు అభివృద్ధి 10 AM – 12.30 PM
పేపర్ 4 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు 3 PM – 5.30 PM

TSPSC Group 2 Exam Date Hall Ticket Download 2024 Webnote: Click Here

How to Download TSPSC Group 2 Hall Ticket 2024

Step 1: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in ను సందర్శించండి.
Step 2: TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 కోసం హాల్ టికెట్ అనే లింక్ పై క్లిక్ చేయండి.
Step 3: మీరు మీ TSPSC ID మరియు పుట్టిన తేదీ  వివరాలను నమోదు చేసిన తర్వాత డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయండి.
Step 4: లాగిన్ అయిన తర్వాత, మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీరు హాల్ టికెట్ ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు.

TSPSC Group 2 Hall Ticket 2024 Download Link: Click Here 

Important Details to check on TSPSC Group 2 Hall Ticket 2024

అభ్యర్థులు పరీక్ష తేదీకి ముందు గ్రూప్ 2 హాల్ టికెట్‌లో క్రింద పేర్కొన్న వివరాలను తనిఖీ చేసుకోవాలి. 

  • దరఖాస్తుదారు పేరు
  • పరీక్ష పేరు
  • పరీక్ష సమయం & తేదీ
  • పరీక్ష సెంటర్
  • తండ్రి పేరు
  • Category & Gender 
  • Roll Number 
  • దరఖాస్తుదారు ఫోటో
  • దరఖాస్తుదారుని సంతకం

హాల్ టికెట్‌లో ఏదైనా తప్పులను గుర్తించిన దరఖాస్తుదారులు లేదా అస్పష్టమైన/తప్పు ఫోటో లేదా సంతకం ఉన్నట్లయితే వెంటనే TSPSC అధికారులను సంప్రదించాలి. 

గమనిక: ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవడం లో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే TGPSC టెక్నికల్‌ హెల్ప్‌ డెస్క్‌ ఫోన్‌ నంబర్‌ 040-2354 2185 లేదా 040-2354 2187 సంప్రదించాలని లేదా Helpdesk@tspsc.gov.in కు ఈ-మెయిల్‌ చేయవచ్చని అధికారులు సూచించారు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *