jobalertstelugu

TSPSC Group 2 Hall Ticket 2024 Download [Link], Exam Date


TSPSC Group 2 Exam Date 2024 Announced, TSPSC Group 2 Hall Ticket 2024 will be released on 09 December 2024 on the official website @ www.tspsc.gov.in.

TSPSC Group 2 Hall Ticket Download 2024
TSPSC Group 2 Hall Ticket Download 2024

TSPSC Group 2 Hall Ticket 2024 Download

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 సర్వీసుల కింద వివిధ కేటగిరీల్లోని 783 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC Group 2 Notification ను విడుదల చేసింది. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ACTO (అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్), సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, మున్సిపల్ కమీషనర్ Gr-III, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ వంటి మొదలైన వివిధ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 2 పరీక్షను నిర్వహిస్తుంది. TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 కొత్త పరీక్ష తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన 22 ఆగస్టు 2024న అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.inలో విడుదల చేయబడింది. ఇంతకుముందు ఆగస్టు 2024లో షెడ్యూల్ చేయబడిన TSPSC గ్రూప్ 2 పరీక్ష 15 మరియు 16 డిసెంబర్ 2024కి రీషెడ్యూల్ చేసారు. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024ని 9 డిసెంబర్ 2024న అధికారిక వెబ్‌సైట్ @tspsc.gov.inలో విడుదల చేస్తుంది. TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 డిసెంబర్ 15 మరియు 16, 2024 తేదీల్లో నిర్వహిస్తున్నారు.. అభ్యర్థులు పరీక్షా కేంద్రం లోనికి అడ్మిట్ కార్డ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ తీసుకురావాలి.

TSPSC Group 2 Hall Ticket 2024 Download Link

TSPSC అధికారులు పరీక్ష తేదీకి ఒక వారం ముందు అనగా 9 డిసెంబర్ 2024న అధికారిక వెబ్‌సైట్ @tspsc.gov.inలో గ్రూప్ 2 హాల్ టిక్కెట్లను విడుదల చేస్తారు. TSPSC గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు OTR మరియు పుట్టిన తేదీని ఉపయోగించి హాల్ టికెట్ 2024 ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 2 పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించబడుతుంది, అంటే ఉదయం 10 నుండి 12:30 వరకు మరియు మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది.

TSPSC Group 2 Hall Ticket 2024 Download Link: Click Here

TSPSC గ్రూప్ 2 పరీక్ష తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కేంద్రాలలో జరుగుతుంది. మీరు అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in నుండి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 విడుదలైన వెంటనే మేము డౌన్‌లోడ్ లింక్‌ను ఇక్కడ అప్‌డేట్ చేస్తాము, మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదు. హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, మీకు మీ OTR వివరాలు మరియు పుట్టిన తేదీ అవసరం. TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోండి మరియు పరీక్ష కోసం ప్రింటవుట్ తీసుకోండి.

TSPSC Group 2 Hall Ticket Download 2024:

తెలంగాణలో దాదాపు 783 గ్రూప్‌-2 పోస్టులకు 5.5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు  తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ  మేరకు టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 హాల్‌టికెట్లు  అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో విడుదలకానున్నాయి.  

TSPSC Group 2 Exam Pattern 2024:

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షలో మొత్తం నాలుగు పేపర్ లు ఉన్నాయి. దానికోసం డిసెంబర్ 15న రెండు సెషన్లలో అనగా  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1 మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 16న పేపర్‌-3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-4 నిర్వహిస్తారు. అభ్యర్థులు ఉదయం 08:30 గంటల నుంచి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబడతారు.ఉదయం 09:30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్ మూసివేయబడును. మధ్యాహ్నం సెషన్ కోసం మరియు  మధ్యాహ్నం 1:30 PM నుండి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబడతారు. 2:30 PM తరవాత అభ్యర్థులెవరూ ప్రవేశించడానికి అనుమతించబడరు. గేట్లు మూసివేసిన తర్వాత అభ్యర్థులు ఎవరు పరీక్షా కేంద్రం లోనికి అనుమతించబడరు. కావున అభ్యర్థులు పరీక్షా కేంద్రం కు త్వరగా వచ్చి గేట్ లు తెరిచిన తరవాత లోనికి వెళ్ళగలరు. 

TSPSC Group 2 Exam Date 2024

S No TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీ 2024 పేపర్  సబ్జెక్టులు సమయం 
 

1

 

15 డిసెంబర్ 2024

పేపర్ 1 జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ 10 AM – 12.30 PPM
పేపర్ 2  చరిత్ర, పాలిటి  మరియు సొసైటీ  3 PM – 5.30 PM
 

2

 

16 డిసెంబర్ 2024

పేపర్ 3 ఎకానమీ  మరియు అభివృద్ధి 10 AM – 12.30 PM
పేపర్ 4 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు 3 PM – 5.30 PM

TSPSC Group 2 Exam Date Hall Ticket Download 2024 Webnote: Click Here

How to Download TSPSC Group 2 Hall Ticket 2024

Step 1: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in ను సందర్శించండి.
Step 2: TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 కోసం హాల్ టికెట్ అనే లింక్ పై క్లిక్ చేయండి.
Step 3: మీరు మీ TSPSC ID మరియు పుట్టిన తేదీ  వివరాలను నమోదు చేసిన తర్వాత డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయండి.
Step 4: లాగిన్ అయిన తర్వాత, మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీరు హాల్ టికెట్ ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు..

TSPSC Group 2 Hall Ticket 2024 Download Link: Click Here 

Important Details to check on TSPSC Group 2 Hall Ticket 2024

అభ్యర్థులు పరీక్ష తేదీకి ముందు గ్రూప్ 2 హాల్ టికెట్‌లో క్రింద పేర్కొన్న వివరాలను తనిఖీ చేసుకోవాలి. 

  • దరఖాస్తుదారు పేరు
  • పరీక్ష పేరు
  • పరీక్ష సమయం & తేదీ
  • పరీక్ష సెంటర్
  • తండ్రి పేరు
  • Category & Gender 
  • Roll Number 
  • దరఖాస్తుదారు ఫోటో
  • దరఖాస్తుదారుని సంతకం

హాల్ టికెట్‌లో ఏదైనా తప్పులను గుర్తించిన దరఖాస్తుదారులు లేదా అస్పష్టమైన/తప్పు ఫోటో లేదా సంతకం ఉన్నట్లయితే వెంటనే TSPSC అధికారులను సంప్రదించాలి. 

గమనిక: ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవడం లో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే TGPSC టెక్నికల్‌ హెల్ప్‌ డెస్క్‌ ఫోన్‌ నంబర్‌ 040-2354 2185 లేదా 040-2354 2187 సంప్రదించాలని లేదా Helpdesk@tspsc.gov.in కు ఈ-మెయిల్‌ చేయవచ్చని అధికారులు సూచించారు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *