jobalertstelugu

TSPSC Group 3 Hall Ticket 2024 Download: Step-by-Step Guide


TSPSC Group 3 Hall Ticket 2024 : తెలంగాణలో TGPSC (TSPSC) గ్రూప్‌ 3 నియామక పరీక్షలను నవంబర్‌ 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ  మేరకు టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 హాల్‌టికెట్లు ఇటీవల అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి.

TSPSC Group 3 Hall Tickets 2024
TSPSC Group 3 Hall Tickets 2024
TSPSC Group 3 Hall Ticket Download 2024:

తెలంగాణలో దాదాపు 1380 గ్రూప్‌-3 పోస్టులకు 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ గ్రూప్‌-3 పరీక్షలు నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ  మేరకు టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 హాల్‌టికెట్లు ఇటీవల అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. 

తెలంగాణ గ్రూప్‌-3 పరీక్షలో మొత్తం మూడు పేపర్ లు ఉన్నాయి. దానికోసం నవంబర్‌ 17న రెండు సెషన్లలో అనగా  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1 మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 నిర్వహించనున్నారు. అలాగే నవంబర్‌ 18న పేపర్‌-3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఉదయం 08:30 గంటల నుంచి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబడతారు.ఉదయం 09:30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్ మూసివేయబడును. మధ్యాహ్నం సెషన్ కోసం మరియు  మధ్యాహ్నం 1:30 PM నుండి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబడతారు. 2:30 PM తరవాత అభ్యర్థులెవరూ ప్రవేశించడానికి అనుమతించబడరు. గేట్లు మూసివేసిన తర్వాత అభ్యర్థులు ఎవరు పరీక్షా కేంద్రం లోనికి అనుమతించబడరు. కావున అభ్యర్థులు పరీక్షా కేంద్రం కు త్వరగా వచ్చి గేట్ లు తెరిచిన తరవాత లోనికి వెళ్ళగలరు. 

TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024

జనవరి-ఫిబ్రవరి 2023 లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకుమాత్రమే TSPSC గ్రూప్ 3 పరీక్ష 2024 హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. TSPSC గ్రూప్ 3 పరీక్ష 2024 హాల్ టికెట్ నవంబర్ 10, 2024 నుండి అధికారిక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెబ్‌సైట్ లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఈ హాల్ టిక్కెట్లను అభ్యర్థులు TSPSC ID మరియు పుట్టిన తేది తో లాగిన్ చేయడం ద్వారా వారి అడ్మిట్ కార్డ్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

TSPSC గ్రూప్ 3 పరీక్ష 2024 కు హాల్ టికెట్ తప్పనిసరి పత్రం. పరీక్ష రోజున అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి ప్రింటెడ్ హాల్ టికెట్ మరియు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్ రెండింటినీ పరీక్షా కేంద్రం లో అధికారులకు సమర్పించాలి.లేనిచో పరీక్షా కేంద్రం లోనికి అధికారులు అనుమతించరు.

TSPSC Group 3 Exam Date 2024

Details Date & Time
Date Availability of Hall Ticket on Website నవంబర్ 10, 2024
Exam Date (Paper 1) నవంబర్ 17, 2024 & 10:00 AM to 12:30 PM
Exam Date (Paper 2) నవంబర్ 17, 2024 & 3:00 PM to 5:30 PM
Exam Date (Paper 3) నవంబర్ 18, 2024 & 10:00 AM to 12:30 PM

Official Web note: Click Here

TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

Step 1: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in ను సందర్శించండి.
Step 2: TSPSC గ్రూప్ III పరీక్ష 2024 కోసం హాల్ టికెట్ అనే లింక్ పై క్లిక్ చేయండి.
Step 3: మీరు మీ TSPSC ID మరియు పుట్టిన తేదీ  వివరాలను నమోదు చేసిన తర్వాత డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయండి.
Step 4: లాగిన్ అయిన తర్వాత, మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీరు హాల్ టికెట్ ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు..

Download Hall tickets for TSPSC Group 3 Services 2024: Click Here 

గమనిక: ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవడం లో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే TGPSC టెక్నికల్‌ హెల్ప్‌ డెస్క్‌ ఫోన్‌ నంబర్‌ 040-2354 2185 లేదా 040-2354 2187 సంప్రదించాలని లేదా Helpdesk@tspsc.gov.in కు ఈ-మెయిల్‌ చేయవచ్చని అధికారులు సూచించారు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *